సీఎం జగన్‌ను విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు
సాక్షి, నరసరావుపేట: జైలులో ఉన్న రౌడీషీటర్‌ను చూసేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సబ్ జైలుకు వెళ్ళటం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నరసరావుపేటలో లోకేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎస్సీ మహిళైన తహసీల్దార్ వనజాక్షిని కొట్టిన చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు ప్రకటించిన వెంటనే లోకేష్ రౌడీషీటర్‌ను చూసేందుకు రావటం గమనార్హమన్నారు.